December 19, 2024

మ‌హాశివ‌రాత్రి ఊరేగింపులో విషాదం

జైపూర్ : రాజస్ధాన్‌లోని కోటాలో దారుణం జ‌రిగింది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌లో 14 మంది చిన్నారుల‌కు గాయాల‌య్యాయి. విద్యుత్ షాక్‌తో గాయాలైన పిల్ల‌ల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, రాజస్ధాన్ ఇంధ‌న శాఖ మంత్రి హీరాలాల్ నాగ‌ర్ ఆస్ప‌త్రికి చేరుకుని గాయ‌ప‌డిన చిన్నారుల‌ను ప‌రామ‌ర్శించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌ల‌ను అందించాల‌ని వారు ఆస్ప‌త్రి అధికారుల‌ను ఆదేశించారు.