నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ : లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితా విడుదలైంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ తొలి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ స్థానాన్ని ప్రకటించకుండా కాంగ్రెస్ అధిష్టానం హోల్డ్‌లో పెట్టింది.
జహీరాబాద్ – సురేష్ షెట్కార్
నల్లగొండ – కుందూరు రఘువీర్
మహబూబాబాద్ – బలరాం నాయక్
చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి