రాజారాంపల్లిలో కొలువుదీరిన దుర్గామాత విగ్రహాలు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా క్రీడా ప్రాంగణంలో, గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు.క్రీడా ప్రాంగణం ఆవరణలో రాజారాంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ గెల్లు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా దుర్గా మాత విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు. అదే విధంగా రాజారాంపల్లి గ్రామం లోని హనుమాన్ దేవాలయం వద్ద గ్రామ హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారిగా దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించగా…విగ్రహ దాతలుగా కాంగ్రెస్ పార్టీ యువ నేత సంగ రమేష్ యాదవ్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు తోడేటి సతీష్ గౌడ్ లు దుర్గాదేవి విగ్రహ దాతలుగా నిలిచారు.