December 20, 2024

పోగొట్టుకున్న మొబైల్ అప్పగించిన ఎస్సై రవి కిరణ్

పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్ధపల్లి గ్రామానికి చెందిన గడ్డం తిరుపతి అనే వ్యక్తి తన మొబైల్ ఎక్కడో పడేసుకున్నాడు. అనంతరం దగ్గరలోని పెగడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా ఫోనును గుర్తించి మంగళవారం రోజున బాధితునికి అప్పగించారు. ఇందుకు గాను బాధితుడు ఎస్ఐ రవికిరణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు.