December 20, 2024

టీ అమ్ముకుంటూ..ఆరు నెలల్లో ఐదు కొలువులు

  • నిరుద్యోగ యువతకు ఆదర్శం ఉడాన్ శివ్ మహేష్

కష్టపడితే సాధించ లేనిది ఏది లేదని, లక్షల మంది పోటీలో ఉన్న ఇవేవీ తన విజయాన్ని ఆపలేదు. నేటి ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాదించడమే కష్టం కానీ పెద్దపల్లి జిల్లా ధర్మారంకు చెందిన ఉడాన్ శివ్ మహేష్ అనే యువకుడు ఆరు నెలల వ్యవదిలోనే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు తన ఖాతాలో వేసుకుని, నిరుద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు. సోమవారం విడుదలైన డీఎస్సీలో (హిందీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్) పలితాల్లో పెద్దపల్లి జిల్లా మొదటి ర్యాంక్ తో స్థానం సాధించి మరో మారు తన సత్తా చాటాడు. 2024 మార్చిలో విడుదలైన గురుకుల ఉపాధ్యాయ ఫలితాల్లో టీజీటీ, పీజీటీలలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించాడు. దీంతో పాటు గురుకుల జేఎల్ (హింది) లో రాష్ట్రస్థాయిలో 4వ స్థానం సాధించి తర్వాత టిఎస్పీఎస్సీ జేఎల్ లో రాష్ట్ర స్థాయి రెండవ స్థానం సాధించాడు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా మామిడి గురుకుల పాఠశాలలో జేఎల్ గా గత మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్న మహేష్ విజయ పరంపర సన్నధం గూర్చి తట్టగా అతడి మాటల్లో…మాది నిరుపేద కుటుంబం తల్లిదండ్రులు (సుశీల-లక్ష్మణ్) అన్నయ్య, చెల్లె, నేను మా కుటుంబ పోషణ కోసం నాన్న హోటల్ నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే నేను పదవ తరగతి ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియట్ సాధన కళశాల ధర్మారంలో చదువుకుని, పై చదువుల నిమిత్తం కాకతీయ యూనివర్శిటీలో డిగ్రీ తర్వాత అంబేడ్కర్ యూనివర్శిటీ ఎంఏ హిందీ సబ్జెక్టు తో పీజీ పూర్తి చేయడం జరిగింది. ఇదే సమయంలో వివాహం చేసుకున్నానని, కుమారుడు ఉన్నడన్నారు. ఉద్యోగ అవకాశాలు లేకా కుటుంబ పోషణకై రాజారాంపల్లిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ప్రయివేట్ పాఠశాలలో ఉపాద్యాయుడిగా పని చేశానని, ఒక దశలో టీ స్టాల్ కూడా నిర్వహించానని, తర్వాతి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో శ్రేయోభిలాషుల సహకారంతో నెల రోజుల పాటు పోటీ పరీక్షలకు శిక్షణ పొంది తర్వాత మూడు నెలలు కరీంనగర్ జిల్లా గ్రంథాలయమే కేంద్రంగా ఐదు రూపాయల భోజనం తిని రోజుకు 14 గంటలు సన్నద్ధమైయనని తెలిపారు. ఇదే క్రమంలో వరుస కొలువులు సాధించానని ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, భార్య తొడ్పాటు, శ్రేయోభిలాషుల సహకారం మరువలేనిదని భావోద్వేగానికీ లోనైయ్యాడు. పెద కుటుంబంలో ఉండే కష్టాలంన్నింటిని ఎదుర్కొని ఈ స్థాయి లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. పోటి పరీక్షలకు సిద్దమయ్యో అభ్యర్థులందరు నిరంతర కృషి, పట్టుదల సాధన అవసరం అని, తాత్కాలిక అనందాలకు దూరం ఉండి కష్టపడితే వచ్చే ఫలితం శాశ్వత అనందం ఇస్తుందని సూచించారు. పోటి పరీక్షల అభ్యర్థులు సాదన పరంగా సమస్యలు ఉంటే నన్ను సంప్రదిస్తే సలహాలు, సూచనలు, మేళకువలు అందిస్తానని ఈ సందర్బంగా తెలియజేశాడు. వరుస ప్రభుత్వ కొలువులు సాధిస్తున్న ఉడాన్ శివ్ మహేష్ ప్రతిభను అభినందిస్తూ నేటి తరం నిరుద్యోగ యువతకు మహేష్ ఆదర్శం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.