ఆహ్వాన పత్రికను విడుదల చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- జగిత్యాల పట్టణంలోని శ్రీ హిందూ కాలికామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గ శరన్నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రాన్ని బుధవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. పట్టణంలోని ఇందిరా భవన్ ఎమ్మెల్సీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఆయన కుమారుడు తాటిపర్తి రాంచంద్ర రెడ్డి కి ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందచేసి వేడుకల్లో పాల్గొనాలని కోరారు.