వెల్గటూర్ లో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
ఏదినిజం,ధర్మపురి(వెల్గటూర్): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 40వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం ఆమె చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటిపత్రి శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ..పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఉమ్మడి వెల్గటూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటిపత్రి శైలేందర్ రెడ్డి,మండల యూత్ పార్టీ అధ్యక్షుడు పూదరి రమేష్, వెల్గటూర్ మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, వెల్గటూర్ మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, చెగ్యాం మాజీ ఎంపిటిసి రంగు తిరుపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మెరుగు నరేష్ గౌడ్, గుమ్ముల వెంకటేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.