కొత్తపేట గ్రామంలో ఘనంగా దసరా వేడుకలు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శనివారం (జె.ఎమ్.అర్) ట్రస్ట్ వ్యవస్థపాకులు జీరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా కలిసి శమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రామ ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలని,ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని,గ్రామ ప్రజలకు విజయాలు సిద్ధించాలని అమ్మవారికి జీరెడ్డి మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.జె.ఎమ్.అర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జెరెడ్డి మహేందర్ రెడ్డి అయన యొక్క నివాస ప్రాంగణంలో దసరా పండుగను పూరస్కరించుకొని కుటుంబ సమేతంగా,వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన యొక్క కుటుంబ సభ్యులు పాల్గొని తదనంతరం శమి పూజ నిర్వహించారు. సంప్రదాయ పద్ధతి లో భాగంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు. జమ్మి చెట్టు ఆకులు తీసుకొని ఒకరి ఒకరు ఆత్మీయ అలింగానం తో దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అలాయ్ బాలయ్ తీసుకోవడం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,వివిధ యూత్ సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.