December 20, 2024

జగిత్యాల ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన రైతులు

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని  రాయికల్ మండలం మైతాపూర్ గ్రామ  రైతులు గురువారం  కలిసి వినతి పత్రం అందజేశారు.మైతాపూర్ గ్రామంలో దాదాపు 200 మంది పైడుమడుగు ఇండియన్ బ్యాంకులో రుణాలు పొందారని ఈ బ్యాంకులో మెజారిటీ శాతం రైతులకు రుణమాఫీ అమలు కాలేదని, రుణమాఫీ అమలు చేసే విధంగా కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా లీడ్బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి సమస్య తెలుసుకొని, ప్రభుత్వం దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి ,ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 100 శాతం రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ  ఛైర్మెన్ గన్నె రాజీరెడ్డి,రఘుపతి రెడ్డి,గంపఆనంద్,సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.