ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను రద్దు చేయాలి
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను రద్దు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మందపల్లి శ్రీనివాస్ డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఈడబ్ల్యూఎస్ ( ఎకనామికల్ వీకర్ సెక్షన్ ) ను 2019లో రాజ్యాంగ సవరణ 103 లో భాగంగా ప్రవేశపెట్టిన రిజర్వేషన్ ప్రకారంగా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఎండపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మందపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ ఆధారంగా ప్రభుత్వ కాలేజీల్లో, వసతి గృహాల్లో, ఉద్యోగాల్లో 10% రాయితీ కల్పించడంతో, బీసీ రిజర్వేషన్లకే కోత విధించబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైనా నియామకల్లో ఎస్సీ, ఎస్టి, బీసీలు వారి రిజర్వేషన్ కే పరిమితం కాగా, ఓసి సామాజిక వర్గానికి చెందినవారు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అడ్డుపెట్టుకొని అప్పనంగా కాలేజీల్లో సీట్లు, ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను రాజ్యాంగ సవరణ చేసి రద్దు చేయాలని కోరారు. అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినవారు సంవత్సర ఆదాయం 8, లక్షలు ఉన్న ధనవంతులు కాదని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అస్త్రంగా వాడతారు, అదే వెనుకబడిన వర్గానికి చెందిన ( బిసి )లు సంవత్సర ఆదాయం ఒక లక్ష దాటితే సంపన్న వర్గం అవుతున్నారు. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.