December 18, 2024

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లి గ్రామంలో ముకాస ఆధ్వర్యంలో 2014 సంవత్సరం నుండి ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా సంఘ భవనంలో దుర్గామాతను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఉత్సవాలు దసరా వరకు ఘనంగా నిర్వహించబడును ఇట్టి కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల గౌరవ అధ్యక్షులు గాండ్ల స్వామి, గ్రామ మాజీ సర్పంచ్ అడువాల అరుణ జ్యోతి, రవి సింగిల్ విండో డైరెక్టర్ దిటి శ్రీనివాస్ ముకాస గ్రామ శాఖ అధ్యక్షుడు కొమిరిశెట్టి సత్యనారాయణ ముకాస నాయకులు కుమ్మరి కుంట సంతోష్ చిరుతల రామాయణ పండితులు గాండ్ల నర్సయ్య విగ్రహ దాత రమేష్ పూజారి తాటికొండ సంతోషమాచార్యులు, ఎడ్ల మహేష్, మూకాస సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.