December 23, 2024

వింధ్యవ్యాలీలో ఘనంగా దీపావళి సంబరాలు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వింధ్యవ్యాలీ ఉన్నత పాఠశాలలో బుధవారం దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీ ప్రకాష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి పండుగ అన్నారు. దీపావళి పండుగ శాస్త్రీయ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులు దీపావళి ఉత్సాహాన్ని ప్రతిబింబించే అనేక ప్రదర్శనలను ప్రదర్శించారు. చిన్నారులు టపాసులను కాల్చి సంబరాలు చేశారు. చివరగా పాఠశాల మైదానంలో నరకాసుర వధ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వింధ్యావ్యాలీ పాఠశాల వైస్ చైర్మన్ రామవరం పృథ్వీరావు, ప్రిన్సిపాల్ జి ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.