December 23, 2024

ఏదినిజం, వెల్గటూర్: మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త రేణిగుంట ప్రసాద్ తల్లి రేణిగుంట చిలకమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం అధ్యక్షుడు రేగొండ రామన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలేటి క్రిష్ణ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్,మాజీ మండల అధ్యక్షుడు మూగల సత్యం,పట్టణ శాఖ అధ్యక్షుడు రంగు తిరుపతి గౌడ్,పల్లెర్ల భూమయ్య,తదితరులు పాల్గొన్నారు.