December 20, 2024

ఉద్యోగాలు పొందిన యువకులకు సన్మానం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట గ్రామానికి చెందిన నలుగురు యువకులు వివిధ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో వారిని శనివారం రోజున ఘనంగా సన్మానించారు.ఎల్కటూరి ప్రేమ్ సాగర్ (గురుకుల టి.జి.టి),ఎల్కటూరి రమేష్(టి.జి.ఎస్.పి.సి కానిస్టేబుల్),ఏల్కటూరి శ్రీనివాస్(అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్),ఎల్కటూరి అరవింద్(సింగరేణి)లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో యువకులు వీరిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఊరికి గొప్ప పేరు తీసుకురావాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ ద్యావనపల్లి లక్ష్మీ-ఎల్లయ్య, చెగ్యాం తాజా మాజీ సర్పంచ్ రామిళ్ళ లావణ్య-సనిల్, సింగిల్ విండో చైర్మన్ ద్యవనపల్లి సుధాకర్, ఎల్కటూరి కుటుంబీకులు, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.