ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
జగిత్యాల అర్బన్ టి ఆర్ నగర్ నందు గాంధీ మహాత్ముని జన్మదినం పురస్కరించుకొని “మహాత్మా వందనం” అని నినాదంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల బ్రాంచ్ కి చెందిన డాక్టర్స్ బృందంచే నిరుపేదలైన వృద్ధులను వారిని పరీక్షించి ఉచితంగా రక్త ,బిపి, షుగర్ టెస్ట్ నిర్వహించి మందులులతో పాటు పండ్లు,బ్రేడ్స్ పంపించేశారు. జగిత్యాల ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్స్ గూడూరి హేమంత్, సెక్రటరీ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ సుధీర్ కుమార్ వారి సిబ్బందితోపాటు ఆశ్రమ నిర్వాహకులు అధ్యక్ష , కార్యదర్శి టీవీ సూర్యం, ముమ్మాడి నాగభూషణం, సభ్యులు, జొన్నల రాము, కేర్ టేకర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.