December 23, 2024

బతుకమ్మా పండుగ విశిష్టత

 

 నేటి నుంచి బతుకమ్మ సంబరాలు రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి ఆ పైన గౌరమ్మను ఉంచి.. మహిళలంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ. నేటి నుంచి మహిళలు రోజుకో విధమైన బతుకమ్మలను పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తుంటారు. బుధవారం అమావాస్య కావడంతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చనున్నారు. మరుసటి రోజు నుంచి అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నెముద్దల బతుకమ్మ చివరగా సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి.