December 23, 2024

సోదరుడిని పరామర్శించిన సీఎం రేవంత్‌ రెడ్డి

సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సోదరుడు తిరుపతి రెడ్డిని(Tirupati Reddy) మాదాపూర్‌ మెడికవర్‌ హాస్పిటల్‌లో(Medicover Hospital) శుక్రవారం పరామర్శించారు. వైద్యులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, నిన్న శ్వాస తీసుకోవటం తీవ్ర ఇబ్బంది తలెత్తగా.. తిరుపతి రెడ్డిని హుటాహుటిన మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. దవాఖానకు సకాలంలో తీసుకెళ్లటంతో.. వైద్యులు వెంటనే చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన తిరుపతి రెడ్డికి యాంజియోగ్రామ్‌ చేశారు. గుండె నరాల్లో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించిన వైద్యులు వెంటనే ఆయన గుండెకు స్టంట్‌ వేసిన విషయం తెలిసిందే.