July 3, 2025

బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్

బి సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సూచనల మేరకు,రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేశం ఆదేశాల ప్రకారంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పోలోజు శ్రీనివాస్ ను నియమిస్తూ రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పోలోజు శ్రీనివాస్ వివిధ సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములైనందున, బీసీలను చైతన్య పరుస్తూ ,బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నందుకుగాను పోలోజు శ్రీనివాస్ ను ఎండపల్లి మండల అధ్యక్షునిగా నియమించినట్లు ముసి పట్ల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.ఈ సందర్భంగా పోలోజు శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నా నియమకానికి సహకరించిన ముసిపట్ల లక్ష్మీనారాయణ, బీసీ సంఘ నాయకులు ఎలుక భగవాన్ యాదవ్, ఎలుక రాజు యాదవ్, తనుగుల జగన్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎండపల్లి మండలంలో ని అన్ని బీసీ కులాలను కలుపుకొని బీసీ సామాజిక వర్గాన్ని చైతన్యవంతులను చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.