July 3, 2025

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ఏదినిజం(ఎండపల్లి): సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతాయనే ఆవేదనతో రైతులు నీటి విడుదల కోరుతూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండలంలోని ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండెడ గ్రామాల్లోని పంటల సాగునీటికి మార్గాలైన ఎస్ఆర్ఎస్పీ కాలువ, పంప్ హౌస్ ద్వారా నీటి విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ గురువారం రాజారాంపల్లి-బసంత్ నగర్ రహదారిపై రైతులు బైఠాయించి దర్నా-నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి ప్రతిపక్ష బాజాపా, బారాసా పార్టీ నాయకులు మద్దతు తెలిపి తక్షణమే సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయా నాయకులు మాట్లడుతూ… ఎన్నికల్లో ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండెడ గ్రామాలకు సాగు నీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హమీతో ఆధికారంలోకి వచ్చి నేడు విస్మరించారని ఆరోపించారు. రైతులను ఇబ్బంది గూరి చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వరినారు పోసి, నాట్లు పూర్తైన కూడా సాగునీటి జాడ లేకపోవటం నిదర్శనంగా సూచించారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి సాగునీరు విడుదల చేయాలని లేని పక్షంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలగడంతో నిరసన కార్యక్రమం విరమించారు. ఈ కార్యక్రమంలో భాజాపా ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షుడు మందపల్లి శ్రీనివాస్, ముంజంపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ బత్తుల సురేష్, భారాస నాయకులు పందిళ్ళ రాజిరెడ్డి, భాజాపా నాయకులు గంధం నారాయణ, గుండ్ర రాజేంధర్, రైతులు కోట నరేష్, కోట మల్లేశం, లక్కాకుల మనోహర్, ఎర్రం రాజయ్య, బొమ్మగాని కనకయ్య, మల్యాల బాపు, పందిరి లచ్చయ్య, అజయ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.