December 20, 2024

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ 

ఏదినిజం,ధర్మపురి(ఎండపల్లి): జగిత్యాల ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మింపజేసిన శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పాల్గోన్నారు.ఈ సందర్భంగా 50 వేల రూపాయల విరాళాన్ని దేవాలయానికి అందజేసి స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు,అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధ ప్రసాదాలను ఎమ్మెల్యేకి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.