గుడికి ఉత్సవ విగ్రహాలు బహుకరణ
ఏదినిజం,ధర్మపురి(ఎండపల్లి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయానికి జె.ఎం.ఆర్ ట్రస్టు వ్యవస్థాపకులు సామాజిక సేవకులు జిరెడ్డి అనూష-మహేందర్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా శివపార్వతి మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహాలను బహుకరించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామంలో నూతనంగా నిర్మించిన గుడికి ఉత్సవ విగ్రహాలు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.