భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి
- భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
- 18 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ
- హర్షం వ్యక్తం చేసిన చెగ్యాం గ్రామస్తులు
- ఏళ్ల నాటికల సహకారం చేసిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం ముంపు బాధితులకు ప్రభుత్వం నుండి విడుదల చేసిన 126 ఇండ్లకు చెందిన 18 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులను శనివారం రోజున చెగ్యాం గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులతో కలిసి పంపిణి చేశారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 18 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు ఇక్కడి బాధితుల గురించి పట్టించుకోలేదని,ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఎంతో మంది భూములు,ఇండ్లు కోల్పోవడం జరిగిందని,చాల సంవత్సరాలుగా ఇక్కడి ప్రాంత ప్రజలు పరిహారం కోసం ఎదురుచూడటం జరుగుతుందని,తను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇట్టి పరిహారం విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని,మంత్రి శ్రీధర్ బాబుని కలిసి వారితో మాట్లాడి భూ నిర్వాసితులకు పరిహారాన్ని అందించడం జరిగిందని దీనిపైన కూడా కొంత మంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం జరుగుతుందని,వారి హయంలో బాధితులకు పరిహారాన్ని అందిస్తాం అంటే మేము ఎక్కడ అడ్డుపడలేదని,ఒక ఎమ్మెల్యే గా,విప్ గా,మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఎందుకు మరి పరిహారాన్ని అందించలేదో ప్రజలకు చెప్పాలని,ఇకనైనా ప్రతిపక్ష నాయకులు వారి వైఖరిని మార్చుకోవాలని,ఇంక పరిహారం రాని బాధితులు ఎవరైనా ఉన్న వారికి కూడా పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్గటూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక,జితేందర్,చెగ్యాం తాజా మాజీ ఎంపిటిసి రంగు తిరుపతి, వెల్గటూర్ తాజా మాజీ ఎంపిటిసి సందీప్ రెడ్డి, ముత్తునూరు తాజా మాజీ ఎంపీటీసీ అనుమాల మంజుల, వెల్గటూర్ తాజా మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, చెగ్యాం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రామగిరి నందయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.