December 20, 2024

“ధర్మ యుద్ధ” మహాసభకు తరలి రండి_ ఎమ్మార్పీఎస్

ఎస్సీ ఏబీసీడీల వర్గీకరణను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జగిత్యాల జిల్లాలో జరిగే ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ మహాసభ ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు మద్దునాల మల్లేశం తెలిపారు. శనివారం  ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సంఘం జిల్లా నాయకులు పేరుక బానేష్, బొల్లి నందయ్య, సుంచు మల్లేశం,కల్లిపెల్లి లింగయ్య, ఇరుగురాల నరసయ్య, సమావేశానికి హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రంగాలలో తగిన రిజర్వేషన్ కల్పించి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జగిత్యాల జిల్లాలో నిర్వహించే ఉమ్మడి జిల్లా ధర్మ యుద్ధ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని సభను విజయవంతం చేయడానికి ధర్మారం మండలంలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు విద్యార్థులు, కవులు, కళాకారులు, మాదిగ మాదిగ ఉపకులాల బంధువులు మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.