చెగ్యాం ముంపు బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం
వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో శనివారం ఉదయం 10:30 కు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం 126 ఇండ్లకు 18 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ పంపిణీ చేయడం జరుగుతుందని వెల్గటూర్ తాసిల్దార్ శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తదితరులు హాజరవుతారని తెలిపారు.