బిసి రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ఇవ్వాలి
బిసి రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ఇవ్వాలి
బీసీ సంఘం ఎండపల్లి అధ్యక్షుడు మందపల్లి శ్రీనివాస్
(ఏదినిజండెస్క్) బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని బీసీ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షుడు మందపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బలహీన వర్గాల రిజర్వేషన్ ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 1983 లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా,ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఉన్న టి.జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని సూచించారని పేర్కొన్నారు. కాని మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలు ఎంపీ సీట్లు ఉండగా వాటిలో ఎనిమిది స్థానాల్లో బిజెపి అభ్యర్థులను ఎంపీ లు గా తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపించినందున తెలంగాణ రాష్ట్ర బహుజన బడుగు బలహీన కులాల వారికి స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లకై బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరారు.