December 20, 2024

జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించిన ఏ.ఏం.సి చైర్మన్ 

వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం రోజున ఏ.ఏం.సి ఛైర్మెన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా ఏ.ఏం.సి చైర్మన్  మాట్లాడుతూ…రైతు సంక్షేమ  కోసం ఎల్లపుడూ కృషి చేస్తామని, వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యాలయ భవనం నిర్మించుటకు ప్రతిపాదన చేసి, వివిధ అభివృద్ధి పనుల కోసం తీర్మానం చేశారు . ఈ కార్యక్రమంలో ఏ.ఏం.సి చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, వెల్గటూర్ గ్రామ పంచాయితీ స్పెషల్ అధికారి ఏం.ఆర్.ఓ ఆర్.శేకర్ , పాలక వర్గం, ఎండపల్లి పాక్స్ చైర్మన్ గూడా రాంరెడ్డి , వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ , మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.