December 16, 2024

ఏపీలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది : సజ్జల

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (AP Advisor Sajjala) విమర్శించారు. పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తు్యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఎన్నికల్లోనైనా చంద్రబాబు పొత్తులు లేనిదే ఎన్నికలకు వెళ్లలేరని పేర్కొన్నారు.

దింపుడు కళ్లెం ఆశలతో బాబు, పవన్‌ ఢిల్లీ వెళ్లారని అన్నారు. పవన్‌ బలమేంట్లో మొన్న సీట్ల కేటాయింపుతో తెలిసిందని, రేపు బీజేపీకి సీట్లు ఇస్తే .. వాళ్ల బలమేంటో తేలుతుందని అన్నారు. బాబు అబద్దాలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని , రాబోయే ఎన్నికల నాటికి ఎంతమంది కలిసివచ్చినా అంతిమంగా గెలుపు వైసీపీదేనని దీమాను వ్యక్తం చేశారు. భారీ కుంభకోణానికి 20 ఏళ్ల క్రితమే చంద్రబాబు ప్లాన్‌ వేశారని, అమరావతి (Amaravati) లోనూ రాజధాని పేరుతో తన భూముల విలువ పెంచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సుమారు లక్ష కోట్లు దోచుకోవడానికి కుట్ర పన్నారని తెలిపారు.