December 19, 2024

తిరుమలలో స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం

 

తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీకొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 57,880 మంది భక్తులు దర్శించుకోగా 19,772 మంది దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు వచ్చిందన్నారు. తిరుపతిలోని శ్రీ‌నివాస‌మంగాపురం క‌ల్యాణ‌ వేంకటేశ్వర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చకులు బాలాజి రంగ‌చార్యులు, తదితరులు పాల్గొన్నారు.